Health Tips: దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఉంటుంది. చాలా మంది ప్రెషర్ కుక్కర్‌లో వండుతారు. ఎందుకంటే.. అందులో వంట చేయడం చాలా సులభం కాబట్టి. ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేదు. తక్కువ సమయం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రెజర్ కుక్కర్‌పై ఆధారపడతారు. కానీ, ఈ ప్రెషర్ కుక్కర్‌లో అన్ని రకాల వంటలు చేయకపోవడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పోయ్యి మీద వంట చేయడం కంటే ప్రెజర్ కుక్కర్‌లో వంట చేయడం వల్ల ఆహారం యొక్క పోషక విలువలు తగ్గుతాయి. కుక్కర్‌లో కొన్ని ఆహార పదార్థాలను వండకూడదు. ఎందుకో తెలుసుకుందాం..
బియ్యం: మనలో చాలామంది ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండుతారు. కానీ.. ప్రెషర్ కుక్కర్ లో అన్నం వండకూడదు. ఎందుకంటే కుక్కర్‌లో అన్నం వండడం వల్ల దాని ఒత్తిడి వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అంతే కాదు యూరిక్ యాసిడ్ పెరగడానికి కూడా కారణమవుతుంది
ఆకుకూరలు: చాలా మంది ఆకుకూరలను ప్రెషర్ కుక్కర్‌లో వండుతారు. కానీ.. ప్రెషర్ కుక్కర్ లోనూ ఆకుకూరలు వండకండి. ఎందుకంటే ఇలా వండడం వల్ల దాని నుంచి నైట్రోజన్ వాయువు విడుదలవుతుంది. ఇది విషపూరితంగా మారుతుంది.
ఇది కూడా చదవండి: Wife Husband: పెళ్లి విషయంలో ఎంత గ్యాప్ ఉండాలంటే
నూడుల్స్: నూడుల్స్ కూడా ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు. ఎందుకంటే వాటిలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టార్చ్ బయటకు వెళ్లాలి. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి
చేపలు: చేపలను కూడా ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు. ఇలా వండటం వల్ల చేపల రుచి చెడిపోవడమే కాకుండా బ్యాక్టీరియాను విడుదల చేసి మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. కాబట్టి ఆ తప్పు చేయవద్దు. చేపల్లో పోషకాలు కూడా తగ్గుతాయి.
పాస్తా: పాస్తాను కూడా ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు. ఎందుకంటే.. పాస్తాలో స్టార్చ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుక్కర్‌లో వండుకుని తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
బంగాళదుంప: మీరు ప్రెషర్ కుక్కర్‌లో బంగాళదుంపను వండుతున్నట్లయితే.. ఇప్పుడు ఆ అలవాటును మార్చుకోండి. ఎందుకంటే కుక్కర్‌లో ఉడికించడం వల్ల అందులోని పోషకాలు తగ్గే అవకాశం ఉంది.