Telangana: తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. ఇప్పటికే పలుచోట్ల కలుషిత ఆహారం వల్ల పదుల సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రుల పాలై చికిత్స పొందుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ పాఠశాల సిబ్బంది స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడే వారికి చికిత్స అందిస్తున్నారు.
