Food Poison: రాష్ట్రంలోని గురుకులాలు రోగాలకు నిలయంగా మారాయి. పాలన పడకేయడంతో విద్యా కేంద్రాలుగా విలసిల్లాల్సిన గురుకు పాఠశాలలు విద్యార్థుల మృతితో స్మశానాలకుగా మారుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా ఘటన మరవక ముందే. మంచిర్యాల జిల్లాలో మరో సంఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా సాయికుంటలోని గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ లో ఉదయం విద్యార్థులు అల్పాహారం కిచిడి తినగా వారిలో 12 మంది పదవతరగతి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలు కాగా ఎక్కువ కావటంతో వెంటనే వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు..ఇప్పుడు విద్యార్థినుల నిలకడగా ఉన్నారని వైద్యులు తెలిపారు ..
Food Poison:విషయం తెలుసుకున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్యం పై వైద్యులను ఆరా తీశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రస్తుతానికి బాగానే ఉన్నారని, 160 మంది విద్యార్థులు కిచిడి తింటే కేవలం 12 మందికి మాత్రమే అస్వస్థకు గురయ్యారని, వారికి ఎటువంటి ప్రమాదం లేదని అన్నారు.. ఫుడ్ శ్యాంపిల్స్ తీసుకొని టెస్టింగ్ కు పంపినట్లు తెలిపారు. ఇందులో ఏదైనా అధికారుల తప్పిదం ఉంటే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ..విషయం తెలుసుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విద్యార్థినులతో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థులను పరామర్శించారు..ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు విద్యార్థులు తెలిపారు..
ఇది కూడా చదవండి: Rash Driving: మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్..
Food Poison:మరోవైపు కుమురంభీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్ధులు ఆరోగ్యం వారం రోజులు గడుస్తున్నా కుదుటపడలేదు. గత వారం కడుపునొప్పి, విరేచనాలతో బాధపడుతూ 60 మందికి పైగా విద్యార్ధులు అస్వస్థతకు గురికాగా వివిధ ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు మరికొంత మంది విద్యార్ధులు వాంతులు, విరేచనాలతో బాధపడటంతో ఆందోళన కలిగించింది.గురుకుల పాఠశాలల్లో వరుస పుడ్ పాయిజన్ ఘటనల పట్ల మాజీమంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.. వాంకిడి ఘటన మరువకముందే..గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన జరగటం దారుణమన్నారు. పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం శోచనీయన్నారు. వివిధ కారణాలు చెబుతూ తప్పించుకోవడం వల్ల ప్రయోజనం లేదని, విద్యార్ధుల ప్రాణాల పట్ల కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.