నెల అంత కష్టపడి ఫ్యామిలీతో అలా కాసేపు ఫ్యామిలీతో బయట టైం గడిపి ఫుడ్ తిని అలా ఎంజాయ్ చేసి వస్తే సూపర్ కదా.. అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఇది కలియుగం ఎందుకైతది మనం మనుషులం ఎందుకైతం.. మనం తిని ఫుడ్ లో పురుగులు రావాలే.. ఎక్స్ పైరీ డేట్ ఐపోవాలే.. తిన్న ఫుడ్ తో ఆస్పత్రి పాలు కావాలి ఇలా ఐతే బాగుంటుంది.. అవును మరి నగరంలోని చాలా హోటళ్ల యజమానులు ఇదే అనుకుతురో ఏమో కానీ ఫుడ్ సేఫ్టీ రెయిడ్స్ లో వాళ్ళ హోటళ్ల బాగోతం అంత బయట పడుతుంది.
తాజాగా, హైదరాబాద్ చైతన్యపురిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. శిల్పి ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిపోయిన కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడి కిచెన్ పరిసరాలు, ఫ్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు. వంటగదిలో బొద్దింకలు తిరుగుతున్నాయి. తయారుచేసే ఆహార పదార్థాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారని అధికారులకు తెలిసింది.
బాహర్ బిర్యాని కేఫ్ లో కిచెన్ పరిసరాల్లో మురుగు నీరు ఉందని, సింథటిక్ ఫుడ్ కలర్స్, కాలం చెల్లిన పెప్పర్ సాస్, చాక్లెట్ సిరప్ వాడుతున్న రెస్టారెంట్ నిర్వాహకులు వినియోగిస్తున్నారని అధికారులు గుర్తించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలాడుతున్న రెస్టారెంట్ నిర్వహకుల మీద అధికారులు చర్యలు తీసుకున్నారు.

