Hyderabad: ఫుడ్ ప్రియులకు.. అదీ రాత్రి సమయంలో డ్యూటీలు ముగించుకుని ఆహరం కోసం బయట వెతుకులాడే వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లో ఫుడ్ స్టాల్స్ అన్నీ రాత్రి ఒంటి గంట వరకూ తెరిచి ఉంచుకోవచ్చని ప్రకటించింది. అంతేకాకుండా అన్ని రకాల దుకాణాలను ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ ఓపెన్ చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. ఇక మందుబాబుల కోసం వైన్ షాపులను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ మేరుకు ఉత్తర్వులు జరీ చేశారు.
