IPL 2025 Mega Auction: మెగా వేలానికి సంబంధించి బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, నవంబర్ 24, 25 తేదీలలో ఆక్షన్‌ను నిర్వహిస్తామని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఇప్పటికే సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ క్రికెటర్లు ఈసారి వేలంలోకి రానుండడంతో మెగా ఆక్షన్ పై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. ఇటీవలే పది ఫ్రాంచైజీలు తమ తమ రిటెన్షన్స్ ప్రకటించేశాయి. రిటెన్షన్‌లో ఫ్రాంచైజీలు 46 మంది ఆటగాళ్లకు రూ. 558.5 కోట్లు ఖర్చు చేశాయి. 204 స్లాట్స్ అందుబాటులో ఉన్న వేలంలో రిటెన్షన్‌కు పోగా మరో రూ. 641.5 కోట్ల నగదు ఫ్రాంచైజీల వద్ద ఉంది. అందుకే వేలంలో ఏ ఆటగాడు ఎంత దక్కించుకుంటానే విషయమై ఉత్కంఠ పెరిగింది. అయితే వేలం జరిగే సమయానికే భారత క్రికెట్ జట్టు ఆసీస్ టూర్‌లో తొలి టెస్టు ఆడనున్న నేపథ్యంలో ప్రసారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా మధ్యాహ్నం సమయంలో వేలం నిర్వహించనున్నట్టు సమాచారం.
