తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ “సంతాన ప్రాప్తిరస్తు”. విక్రాంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఏక్ మినీ కథ, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సూపర్ హిట్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.
తాజాగా ఈ సినిమాకి సంబందించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. చాందిని చౌదరి పుట్టిన రోజు సందర్బంగా వచ్చిన ఈ పోస్టర్ లో తన పేరు కల్యాణి ఓరుగంటి అనీ, వయస్సు 23, తనది వరంగల్ అని తెలిపారు. అలాగే తనకి ఎటువంటి భర్త కావాలి అన్న విషయాన్నీ కూడా పోస్టర్ లో చెప్పారు. తనకి గవర్నమెంట్ ఉద్యోగి, నో స్మోకింగ్, నో డ్రింకింగ్, పూర్తిగా వెజిటేరియన్ కావాలని మెన్షన్ చేశారు. ముఖ్యంగా నో టు సాఫ్ట్వేర్ అని పోస్టర్ లో పేర్కొన్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీలక్ష్మి, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, అనిల్ గిలా, కిరీటి, సద్దాం, తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక బృందం :
మ్యూజిక్ డైరెక్టర్: సునీల్ కశ్యప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ. మధుసూదన్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: మాహి రెడ్డి పండుగుల
డైలాగ్స్: కళ్యాణ్ రాఘవ్
ఎడిటర్: సాయికఅష్ణ గనాల
ప్రొడక్షన్ డిజైనర్: శివకుమార్ మచ్చ
కాస్ట్యూమ్స్ : అస్వత్ భైరి, కే. ప్రతిభా రెడ్డి
పులిచెర్ల పూర్ణ
డిజిటల్ మీడియా: మాయాబజార్
పీఆర్ ఓ – జీఎస్కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే: సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
