Nightclub Fire: నార్త్ మెసిడోనియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని స్కోప్జేకు 100 కి.మీ దూరంలో ఉన్న కొకాని పట్టణంలోని పల్స్ నైట్ క్లబ్‌లో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి క్లబ్‌లో జరిగిన కాన్సర్ట్‌లో దాదాపు 1500 మంది హాజరయ్యారు. అయితే, తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భవనంలోని సీలింగ్‌కు నిప్పు అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 50 మందికిపైగా మరణించగా, 100 మందికిపైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
Also Read : Aurangzeb Tomb: ఔరంగజేబు సమాధి కూల్చివేత.. డేట్ ఫిక్స్
Nightclub Fire: స్థానిక మీడియా ప్రకారం, ఈవెంట్‌లో మండే స్వభావం గల పదార్థాలు ఉపయోగించడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటన స్థలంలో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు.ప్రభుత్వ అధికారులు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.