Mysuru

Mysuru: సిగరెట్ ఆర్పకుండా పారేసిన ఆకతాయిలు.. కొండపై భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన అరుదైన మూలికా మొక్కలు

 Mysuru: మైసూరులోని చాముండి కొండపై జరిగిన అగ్నిప్రమాదంలో అనేక ఎకరాల అడవి, అరుదైన మూలికా మొక్కలు దగ్ధమయ్యాయి. వేసవి తాపం కారణంగా మైసూరులోని ఉత్తనహళ్లి అటవీ ప్రాంతంలోని మొక్కలు, ఆకులు ఎండిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కనిపించింది. దీన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు చేరుకునే సమయానికి మంటలు వేగంగా వ్యాపించాయి. ఆ మంటలు సమీపంలోని చాముండి కొండకు కూడా వ్యాపించాయి. మూడు వాహనాల్లో అగ్నిమాపక సిబ్బంది వచ్చారు.

వీటితో పాటు రెండు నీటి ట్రక్కులను కూడా తీసుకువచ్చారు. ఆరు గంటలకు పైగా శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు ఆరిపోయే వరకు వాహనాలు వెళ్లకుండా నిషేధించారు.
ఇందులో అరుదైన ఔషధ మొక్కలు సహా కొన్ని చిన్న జీవులు చనిపోయాయి.

Also Read: SLBC Praject: కుప్ప‌కూలిన ఎస్ఎల్‌బీసీ సొరంగం.. లోప‌ల చిక్కుకున్న‌ కూలీలు

ప్రాథమిక దర్యాప్తులో గుర్తుతెలియని వ్యక్తులు వ్యక్తులు సిగరెట్ ముక్కను ఆర్పకుండానే పారవేసినట్లు తేలింది. దీంతో ఎండిన ఆకులు, మొక్కలు ఉండటం వల్ల మంటలు చెలరేగాయి. నిన్న ఉదయం వేడి, బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.

ఈ ఘటనపై మైసూరు డివిజన్, అగ్నిమాపక శాఖ జోనల్ అధికారి చందన్ మాట్లాడుతూ.. మాకు మధ్యాహ్నం మాత్రమే సమాచారం అందింది. మేము వెంటనే మూడు వాహనాలతో అక్కడికి వెళ్ళాము. మేము అదనంగా రెండు తాగునీటి వాహనాలను కూడా తీసుకువచ్చాము. ఇద్దరు అధికారుల నేతృత్వంలో 25 మంది అగ్నిమాపక చర్యలో పాల్గొన్నారు. మేము ఒక గంటలో మంటలను వేసేవారం కానీ, ఆ సమయంలో గాలి బలంగా వీచడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీని వలన ఆలస్యం జరిగింది అని వివరించారు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *