Fire Accident: హైదరాబాద్‌లోని నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫర్నిచర్ గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఫర్నిచర్ భారీగా తగలబడుతోంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించింది. మంటలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది.
ఇది కూడా చదవండి: Anantapur: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమకు యువతి బలి.. ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు యువతులు
భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు.అగ్ని ప్రమాదానికి గల కారణాలు పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికార ప్రతినిధులు తెలిపారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాల నివారణ కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.