Janagama: జనగామ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా కేంద్రంలోని విజయ షాపింగ్ మాల్ లో ఆదివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా వంటలు చెలరేగాయి. పక్క షాపులకు కూడా మంటలు అంటుకోవడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఫైర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ట్రై చేసినా మంటలు ఆరాకపోవడంతో షాప్ మొత్తం కాలిపోయింది. దీంతో భారీగా ఆస్తి నస్తంభరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు.

