Vizag Steel Plant

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని ఆర్‌ఎంహెచ్‌పీ (Raw Material Handling Plant) విభాగం వద్ద నిల్వ ఉంచిన కోకింగ్ కోల్ కుప్పల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వేడికి మరింతగా మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా పరిసర ప్రాంతంలో పొగలు కమ్మేశాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నాలు చేస్తున్నారు. భారీ కోల్ నిల్వలు ఉండటంతో మంటలు అదుపు చేయడంలో సిబ్బందికి కష్టాలు ఎదురవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Greta Thunberg: ఫ్యామిలీ బోట్.. గ్రెటా థన్‌బర్గ్‌ ప్రయాణిస్తున్న నౌకపై డ్రోన్‌ దాడి..

స్టీల్‌ ప్లాంట్‌లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు నడపడం, ఉక్కు ఉత్పత్తి కోసం కోకింగ్‌ కోల్‌ను పెద్ద ఎత్తున నిల్వ చేస్తారు. ఈ కోల్ గుట్టలలో ఎండ వేడి కారణంగా మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ప్రమాదంపై స్టీల్‌ప్లాంట్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టనున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bhatti vikramarka: ఇందిరమ్మ రాజ్యంలో కలలు నెరవేర్చుతాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *