Fire Accident: అమీర్‌పేట్‌లో శుక్రవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి బాలాజీ నెయ్యి తయారీ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు విపరీతంగా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మంటలు తీవ్రంగా ఎగసిపడడంతో పక్కనే ఉన్న ఎంబ్రాయిడరీ షాపుకూ వ్యాపించాయి. దాంతో అక్కడ నిల్వ ఉంచిన వస్త్రాలు, సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే దుకాణంలో ఆ సమయంలో ఎంతమంది ఉన్నారన్న దానిపై స్పష్టమైన సమాచారం వెలువడలేదు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలసి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు.
ఇది కూడా చదవండి: Telangana Assembly: అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం పై చర్చ! కేసీఆర్ వస్తారా? కౌంటర్ ఇస్తారా?
ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదం వల్ల ఆర్థిక నష్టం భారీగా జరిగి ఉండొచ్చని అంచనా. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్ – అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం
మెట్రో పిల్లర్ 1444 వద్ద ఉన్న బాలాజీ గీ స్టోర్లో చెలరేగిన మంటలు
దట్టమైన పొగతో నిండిపోయిన పరిసరాలు..#ameerpet #fireaccident #Hyderabad #hyderabadmetro pic.twitter.com/e9R6ROkLo1
— s5news (@s5newsoffical) August 28, 2025