Fire Accident

Fire Accident: కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

Fire Accident: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం పరిధిలో బుధవారం భయానక ఘటన చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పరిసరాలు దద్దరిల్లాయి. పేలుడు అనంతరం మంటలు భారీ ఎత్తున చెలరేగి, మొత్తం ఫ్యాక్టరీని మంటలు చుట్టుముట్టాయి.

ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మంటల ధాటికి, ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ‘రాజకీయ’ ట్విస్ట్..

పేలుడు కారణంగా ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుంది. ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే బాణసంచా తయారీ సమయంలో ఏదో రసాయన ప్రతిచర్య కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ఆదేశించారు.

కోనసీమలో ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పండుగల సీజన్‌లో బాణసంచా ఫ్యాక్టరీల్లో భద్రతా చర్యలు పాటించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *