Adulterated Chilli Powder: వంటల్లో అత్యంత సాధారణంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో మిరపకాయ ఒకటి. తీపి వంటకాలు తప్ప కారం లేకుండా కూరలు వండడం కష్టం. ఇక నాన్‌వెజ్ వంటి వాటిల్లో అయితే కారంట గట్టిగా ఉండాల్సిందే. అయితే ఈ మధ్య మార్కెట్లో కల్తీ కారం ఎక్కువగా కనిపిస్తోంది. కల్తీ కారం పొడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే కల్తీ కారం పొడిని కొన్ని టెస్టుల ద్వారా ఈజీగా గుర్తించొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఎర్ర కారం పొడి కలపాలి. నానబెట్టిన కారం పొడిని అరచేతిలోకి తీసుకొని రుద్దాలి. అది జిడ్డుగా ఉంటే దాంట్లో ఇటుక దుమ్ము కలిపారని అర్ధం.
నానబెట్టిన కారం పొడి చాలా మృదువుగా అనిపిస్తే దాంట్లో సబ్బు పొడి కలిపారని అర్ధం చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: Generic vs Branded Medicines: బ్రాండెడ్ వర్సెస్ జనరిక్ మందులు మధ్య తేడా ఏమిటి..? అవి చౌకగా ఉండటం వల్ల తక్కువ ప్రభావవంతంగా ఉంటాయా?
స్వచ్ఛమైన ఎర్ర కారం పొడిని గుర్తించడానికి.. దానిని నీటిలో వేయాలి. నిజమైన కారం నీటిపై తేలుతుంది. అది నీటిలో మునిగిపోతే అది కల్తీ కారం పొడి అని అర్థం.
స్టార్చ్‌ను ఎర్ర కారం పొడితో కలుపుతారు. దీనిని గుర్తించడానికి, మిరప పొడికి కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. ఈ అయోడిన్ చుక్కలను కలిపిన తర్వాత కారం పొడి నీలం రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. ఇలా కల్తీ కారంపొడిని గుర్తించవచ్చు.