Bellamkonda Suresh

Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై ఆస్తి కబ్జా కేసు!

Bellamkonda Suresh: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇంటిని కబ్జా చేశారంటూ శివ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. బెల్లంకొండ సురేష్, ఆయన అనుచరులు తాళం పగలగొట్టి ఇంటిని ధ్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Dharmendra Death: మా నాన్న ఇంకా చనిపోలేదు..ఈషా దేవోల్‌

ఫిల్మ్ నగర్ రోడ్ నంబర్ 7లో శివ ప్రసాద్ ఇంటిని బెల్లంకొండ సురేష్ కబ్జా చేశారని ఫిర్యాదు అందింది. శివ ప్రసాద్ బంధువుల వద్దకు వెళ్లిన సమయంలో మూడు రోజుల క్రితం తాళం పగలగొట్టారు. ఇంట్లో సామాగ్రి, గోడలు ధ్వంసం చేసి ఆక్రమణకు యత్నించారు. శివ ప్రసాద్ ఇంటికి వచ్చి ధ్వంసాన్ని చూసి షాక్ అయ్యారు. ఆయన సిబ్బందిని పంపగా సురేష్ అసభ్యంగా మాట్లాడి దాడికి పాల్పడ్డారు. దీంతో ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ 329 (4), 324 (5), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెల్లంకొండ సురేష్ ప్రస్తుతం నిర్మాణంలో చురుగ్గా లేరు. ఆయన కుమారులు సాయి శ్రీనివాస్, గణేష్ సినిమాలు చేస్తున్నారు. సాయి శ్రీనివాస్ కిష్కింధపురితో విజయం సాధించి నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గణేష్ స్వాతిముత్యం సినిమా ఆడలేదు. దాంతో ఆయన అంత చురుగ్గా లేరు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *