Ustaad Bhagat Singh: టాలీవుడ్ లో మరోసారి కార్మికుల సమ్మె హాట్ టాపిక్ గా మారింది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుని, వేతనాలు పెంచే వరకు షూటింగ్స్ కు హాజరుకాకూడదని అన్ని కార్మికులకు ఆదేశాలు జారీ చేసింది. 30 శాతం వేతనాల పెంపు కోసం ఫెడరేషన్ ఈ ఆందోళనకు పూనుకుంది.
ఈ డిమాండ్ పై ఫిల్మ్ ఛాంబర్ సహకరించకపోవడంతో, చర్చలు విఫలమయ్యాయి. దాంతో ఆదివారం నుంచే షూటింగ్స్ బంద్ చేసేందుకు సినీ కార్మికులు సిద్ధమయ్యారు. దీంతో టాలీవుడ్ లో చిత్రీకరణలకు బ్రేక్ పడింది.
అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్.. పవన్ పై విమర్శలు
అయితే ఇదే సమయంలో, పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇదే రోజు షూటింగ్ పూర్తి చేస్తే పవన్ కి సంబంధించిన పార్ట్ ముగుస్తుందనే ఉద్దేశంతో నిర్మాతలు షెడ్యూల్ ప్లాన్ చేశారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీపై సుప్రీం ఆగ్రహం..
కానీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ కార్మికులను కాకుండా, ముంబయి, చెన్నై నుంచి సాంకేతిక నిపుణులను తీసుకొచ్చి షూటింగ్ నిర్వహించారు. దీనిపై ఫిలిం ఫెడరేషన్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టూడియో వద్ద నిరసనలు నిర్వహించారు. పవన్ కల్యాణ్‌ను కలసి వేతనాల విషయం చెప్పాలని వారు ప్రయత్నించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చిరకాల పరిష్కారం అవసరం
కార్మికుల వేతనాల విషయమై ఫిల్మ్ ఫెడరేషన్ – ఫిల్మ్ ఛాంబర్ మధ్య గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఫిల్మ్ ఛాంబర్ మాత్రం “ఇప్పటికే మేము కనీస వేతనాల కంటే ఎక్కువే ఇస్తున్నాం” అని చెబుతోంది.
ఇప్పుడు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది.షూటింగ్లకు బ్రేక్ పడటం వల్ల నిర్మాతలకు నష్టం, కార్మికులకు ఉపాధి కోల్పోవడం జరుగుతుంది. అందుకే ఈ సమస్యను చర్చల ద్వారా త్వరగా పరిష్కరించాలని సినీ వర్గాలు కోరుకుంటున్నాయి.