Ram Gopal Varma: సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నేడు పోలీసు విచారణకు హాజరుకానున్నారు. ఆయనని ఒంగోలు గ్రామీణ సీఐ కార్యాలయంలో పోలీసులు విచారిస్తారని తెలుస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల విషయంలో వర్మపై కేసు నమోదు అయింది. మద్దిపాడు మండల టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు విషయంలో ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు . తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు . అయితే , కోర్టు ఈ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది . ఈ నేపథ్యంలో మద్దిపాడు పోలీసులు ఇచ్చిన నోటీసు మేరకు రామ్ గోపాల్ వర్మ ఈరోజు విచారణకు హాజరు కానున్నారు . ఆర్జీవీ విచారణకు వచ్చే విషయంలో సస్పెన్స్ నెలకొని ఉంది . అయితే , ఆయన విచారణకు హాజరు అవుతారంటూ వార్తలు వస్తున్నాయి.


