USA: యెమెన్‌లోని హూతీలపై అమెరికా సైనిక దళాలు పెద్దఎత్తున దాడులు ప్రారంభించాయి. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని గడచిన 24 గంటల్లో అమెరికా వైమానిక దాడులు జరిపింది. హూతీ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం, ఈ దాడుల్లో 31 మంది మరణించగా, 101 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులేనని హూతీ వర్గాలు పేర్కొన్నాయి.
హూతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారని, ముఖ్యంగా అమెరికా నౌకలు, యుద్ధ విమానాలపై వారి దాడులను సహించబోమని యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అమెరికా సైనిక చర్యను హూతీ పొలిటికల్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తూ, దీనిని యుద్ధ నేరంగా అభివర్ణించింది. తమ దళాలు ఎదురు చర్యలకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది.
Also Read: Chandrababu Naidu: రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం
USA: అగ్రరాజ్యం వైఖరిపై ట్రంప్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘హూతీలకు గడ్డు సమయం దగ్గరపడింది. వారు తమ దాడులను వెంటనే నిలిపివేయాలి, లేకపోతే ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’ అంటూ ట్రూత్ సోషల్‌లో సందేశం పెట్టారు. ప్రపంచ సముద్ర మార్గాల్లో అమెరికా నౌకలు స్వేచ్ఛగా సంచరించడాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. హూతీలకు మద్దతు అందిస్తున్న ఇరాన్‌ను తీవ్ర హెచ్చరికలు చేస్తూ, వారి చర్యలకు పూర్తిగా ఇరానే బాధ్యత వహించాలని అన్నారు.