Delhi: దేశంలో భద్రతా పరంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో, తాత్కాలికంగా దేశంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేయాలని నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ వరకు మొత్తం 24 ఎయిర్‌పోర్టులు పూర్తిగా బంద్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ మూసివేత ఉత్తర మరియు పశ్చిమ భారతంలోని ఎయిర్‌పోర్టులపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. జమ్మూ, శ్రీనగర్, అమృత్‌సర్, పాఠాన్కోట్, లేహ్ వంటి ఎయిర్‌బేస్‌లు, అలాగే పంజాబ్, రాజస్తాన్, హర్యానా రాష్ట్రాల్లోని పలు ఎయిర్‌పోర్టులు తాత్కాలికంగా విమాన సర్వీసులను నిలిపివేశాయి.
ఈ చర్య దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను తిరిగి సమీక్షించుకోవాలని, సంబంధిత విమాన సంస్థల సంప్రదనలో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదే సమయంలో, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ మరియు ఇతర భద్రతా సంస్థలు అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నాయి. ప్రజలు గానీ, ప్రయాణికులు గానీ ఆందోళన చెందకూడదని అధికారులు కోరుతున్నారు. పరిస్థితి సాధారణమైన వెంటనే విమాన రాకపోకలు పునరಾರಂಭమవుతాయని తెలిపారు.