Hyderabad: హైదరాబాద్ నగరంలో ఓ మహిళా కానిస్టేబుల్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని సయ్యద్ నగర్‌లో బైక్ పార్కింగ్ విషయంలో ఈ దాడి జరిగింది. మహిళా కానిస్టేబుల్‌ను దూషిస్తూ కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని అడ్డుకున్న ఆ మహిళా కానిస్టేబుల్ తమ్ముడిని కూడా వారు దాడి చేసి కొట్టారు. దీంతో దాడికి పాల్పడిన వారిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
