Fauji: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’లో నటిస్తూనే, హను రాఘవపూడి రూపొందిస్తున్న ‘ఫౌజీ’లోనూ కనిపించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేగంగా సాగుతోంది. తాజాగా, ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని టింబర్ డిపో సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్ సినిమాలో కీలకంగా ఉంటూ, మాస్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని టాక్.
ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా ఎంట్రీ ఇస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ యాక్షన్ అవతార్, హను రాఘవపూడి మార్క్ ఎమోషనల్ డ్రామాతో ‘ఫౌజీ’ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!