Crime News: హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదకరమైన ఘటన జరిగింది. చదువుకోమని ఆశతో కొడుకుకు లక్షలాది రూపాయలు ఇచ్చిన తండ్రిని, అదే కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాదాపూర్‌కు చెందిన హనుమంత్ అనే వ్యక్తి తన కొడుకు రవీందర్‌కు చదువు కోసం రూ. 6 లక్షలు ఇచ్చాడు. కానీ ఆ డబ్బుతో చదువు చెప్పుకోవాల్సిన రవీందర్.. వాటిని లోటస్, బ్లూజోన్, స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్స్‌లో పెట్టి పోగొట్టేశాడు.
ఈ విషయం తండ్రికి తెలిసి తీవ్రంగా మందలించడంతో, కోపానికి గురైన రవీందర్ తండ్రిని హత్య చేశాడు. ఆ హత్యను ఆత్మహత్యలా చూపించేందుకు ప్రయత్నించాడు. తరువాత తండ్రి మృతదేహాన్ని స్వస్థలమైన వనపర్తికి తీసుకెళ్లి, అక్కడ అంత్యక్రియలు చేయాలని యత్నించాడు.
ఇది కూడా చదవండి: Kurnool: కర్నూలులో దారుణం: వివాహేతర సంబంధం ఆరోపణలతో వ్యక్తి హత్య
అయితే అతడి ప్రవర్తనపై బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ ప్రారంభించిన పోలీసులు రవీందర్‌ను ప్రశ్నించగా, మొదట్లో తప్పు ఒప్పుకోలేదు. కానీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో చివరకు తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు.
తండ్రి ఆశతో ఇచ్చిన డబ్బులు బెట్టింగ్‌లో పోగొట్టిన రవీందర్.. చివరకు తనే తండ్రిని హత్య చేసిన పాపానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చదువు కోసం సంపాదించిన తండ్రి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని అంటున్నారు.