Crime News: చిన్నపుడు మనలో చాలామంది త్రండ్రికి తెలియకుండా తన షర్ట్ లోంచి డబ్బులు తీసుకొనే ఉంటాం. కొన్ని సార్లు దొరికితే రెండు దెబ్బలు కోటి మందలిస్తాడు. తర్వాత ఆలా చేయకూడదు తప్పు అని చెపుతారు. కానీ ఈ త్రండ్రి తన 13 ఏళ్ల కూతురు తనకి తెలియకుండా డబ్బులు తీసుకుంది అని ఏకంగా చంపేశాడు ఈ కసాయి తండ్రి.. తనను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో బులంద్‌షహర్ జిల్లాలోని అనుప్‌షహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతురాలు బిచౌలా గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని సోనమ్ (13). త్రండ్రి జేబులో డబ్బులు కనిపియ్యకపోవడంతో అతనికి కూతురి మీద అనుమానం వచ్చింది. యధావిధిగా స్కూల్ కి వెళ్లిన సోనమ్ ని తీసుకురావడానికి గురువారం సాయంత్రం స్కూల్ కి వెళ్ళాడు. పాఠశాల ముగిసిన తర్వాత ఆమె తండ్రి అజయ్ శర్మ ఇంటికి తీసుకెళ్లకుండా పొలాలకు తీసుకెళ్లాడు ఆమెని. అక్కడే కోపంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పడేశాడు.
ఇది కూడా చదవండి: Asia Cup 2025: సూర్యకుమార్కు బిగ్ షాక్.. 30 శాతం జరిమానా
శుక్రవారం సాయంత్రం స్థానికులు వంతెన కింద పొదల్లో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఒక బాలిక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
తండ్రిని విచారించగా, తన కుమార్తె కొంతకాలంగా ఇంటి నుండి డబ్బు దొంగిలిస్తోందని, దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ కోపంతోనే హత్య చేశానని ఒప్పుకున్నాడు. మృతురాలి స్కూల్ బ్యాగ్‌ను కూడా పోలీసులు నిందితుడి పొలం నుండి స్వాధీనం చేసుకున్నారు.
హత్య చేసిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా కూతురు బంధువుల వద్ద ఉందని, రాబోయే మూడు, నాలుగు రోజులు స్కూల్‌కి రాదని ఉపాధ్యాయులకు చెప్పినట్లు కూడా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.