Crime News: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఓ గ్రామంలో సమాజం తలదించుకునేలా ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదేళ్ల అమాయక బాలికపై ఆమె తండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి:
గ్రామానికి చెందిన కుర్వ కుర్మయ్య అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు. వీరిలో చిన్న కుమార్తె వయసు పదేళ్లు. గతంలో ఆరోగ్య సమస్యల కారణంగా ప్రభుత్వ హాస్టల్ నుంచి ఇంటికి తీసుకోని వచ్చారు,ఇపుడు ఆమె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతుంది.
ఈ నెల 25వ తేదీన తల్లి కూలీ పనులకు, తండ్రి మేకల దగ్గరకు వెళ్లగా, బాలిక పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చి హోంవర్క్ చేస్తూ ఒంటరిగా ఉండిపోయింది. సాయంత్రం సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తండ్రి కుర్మయ్య మానవత్వాన్ని మరిచి, కన్న కూతురితో దారుణంగా ప్రవర్తించాడు.
ఇది కూడా చదవండి: Election Commission: 65 లక్షల పేర్లు తొలగింపు పై ఎన్నికల కమిషన్ కీలక వాక్యాలు
బాలిక విన్నవించినా “నాన్నా, నీ కాళ్లు మొక్కుతా.. నన్ను వదిలేయ్” అని మొర పెట్టుకున్నా అతడు ఏ మాత్రం కనికరించలేదు. బాలిక అరుపులు విన్న పొరుగువారు పరుగున వచ్చి ఆమెను కాపాడారు. అప్పటికే బాలికకు తీవ్రమైన రక్తస్రావం జరిగింది.
ఆశ్చర్యంగా ఉంది కానీ నిజం
తల్లి ఇంటికి చేరాక విషయం తెలుసుకొని, బాలికను దగ్గరలోని ఆర్‌ఎంపీ వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో, అదే రోజు రాత్రి మరికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మరుసటి రోజు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స మొదలుపెట్టడానికి పోలీస్ కేసు అవసరమని చెప్పడంతో, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు కుర్మయ్య పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రజలు స్పందన
ఈ ఘటన జిల్లా ప్రజల్లో, మహిళా సంఘాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిందితుడికి కఠినమైన శిక్ష వేయాలని, చిన్నారికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక తండ్రి తన కూతురిపై ఇలా ప్రవర్తించడం చూసి, సమాజం మానవత్వం ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు.
ముగింపు భావం
ఈ ఘటనతో మళ్లీ చిన్నారుల భద్రతపై పెద్ద సందేహాలు తలెత్తుతున్నాయి. బాలిక మానసికంగా, శారీరకంగా తీవ్ర దుస్థితిలో ఉంది. ఆమెకు త్వరగా పూర్తి న్యాయం జరగాలి. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.