Haryana: హర్యానాలోని సిర్సాలో గురువారం ఉదయం స్కూల్ బస్సుపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. వారిద్దరూ తండ్రీ కొడుకులు అని చెబుతున్నారు. అకస్మాత్తుగా స్కూల్ బస్సును చుట్టుముట్టి 8 నుంచి 10 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల కారణంగా వ్యాన్ డ్రైవర్, ఒక విద్యార్థి సహా నలుగురికి గాయాలయ్యాయి. డ్రైవర్ ఛాతీపై తుపాకీ గుండు తగిలింది. అలాగే, ఒక విద్యార్థి కాలికి తూటా తగిలింది.
పాత కక్షల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో ప్రతీకారం కోసం పాఠశాల బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది విద్యార్థుల ప్రాణాలను సైతం పట్టించుకోలేదు. గాయపడిన నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. ఘటన తర్వాత, గాయపడిన వారిని సిర్సా ట్రామా సెంటర్‌లో చేర్చారు.
ఇది కూడా చదవండి: Badamgir Sai: ప్రముఖ నాటక రచయిత బాదంగీర్ సాయి కన్నుమూత
Haryana: స్కూల్ బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేరానికి పాల్పడిన అనంతరం నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితులు తమ కారుతో పోలీసు కారును కూడా ఢీకొట్టారు.

