FASTag Annual Pass:ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను తీసుకొస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించడంతో వాహనదారుల్లో ఒకవైపు హర్షం వ్యక్తమవుతుండగా, మరోవైపు ఆందోళన నెలకొన్నది. ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను రూ.3,000తో 200 ట్రిప్పులు లేదా ఏడాదిపాటు హైవేలపై ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ మేరకు రోడ్లు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. హైవేలపై వాహనాల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు వార్షిక ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
FASTag Annual Pass:ఈ నేపథ్యంలో ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ విధానాన్ని 2025 ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. తరచూ హైవేలపై ప్రయాణించే వారి కోసం ఇది మరింతగా ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది. ఇది ఎలా ఉపయోగపడుతుందోననే విషయాలను కేంద్రం తెలిపింది.
FASTag Annual Pass:ఈ వార్షిక ఫాస్టాగ్ పాస్ వ్యక్తిగత, వాణిజ్యేతర వాహనాల (కార్లు, జీపులు, వ్యాన్లు) కోసం అందుబాటులో ఉంటుంది. ఈ పాస్ ఏడాది లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది. దీనిలో ఇంకో థ్రిస్ట్ ఉన్నది. అదేమిటంటే.. ఏది ముందు వస్తే దానినే పరిగణనలోకి తీసుకుంటారు. టోల్‌ప్లాజాలకు 60 కిలోమీటర్ల సమీపంలో నివసించే ప్రయాణికులకు ఈ పాస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
FASTag Annual Pass:ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను రాజ్‌మార్గ్ యాత్ర మొబైల్ యాప్ ద్వారా లేదా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ఎహ్ఏఐ), రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (ఎంవోఆర్టీహెచ్) అధికారిక వెబ్‌సైట్‌లలో పొందవచ్చు. ఆగస్టు 15న ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభానికి ముందే యాక్టివేషన్, రెన్యువల్ కోసం ప్రత్యేక లింక్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది.

