FASTag Annual Pass: దేశవ్యాప్తంగా వాహనదారులకు అందిన శుభవార్త ఈ రోజు నుంచే అమలు కానున్నది. ఆగస్టు 15 నుంచి నూతన ఫాస్టాగ్ పథకాన్ని అమలు చేస్తామని రెండు నెలల క్రితమే కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. వాహనదారుల శ్రేయస్సు కోసం వార్షిక టోల్ చార్జీ పేరిట నూతన కొత్త పాస్ ప్రవేశపెట్టనున్నట్టు ఆ నాడే ప్రకటించారు.
FASTag Annual Pass: ఈ కొత్త పాస్ ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేటు వాహనదారులకు చాలా వరకు డబ్బు, సమయం ఆదా అవుతుంది. ఈ కొత్త పాస్ వల్ల కేవలం రూ.15కే టోల్ ప్లాజాను దాటగలరు. ఇది గతంలో ఉన్న చార్జీ కంటే చాలా తక్కువ అని మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. అది ఈ రోజు (ఆగస్టు 15) నుంచి అమలు లోకి వస్తుండటంతో వాహనదారుల అనుభవాన్ని బట్టి తెలుస్తుంది.
FASTag Annual Pass: వార్షిక ఫాస్టాగ్ పాస్ ధరను మంత్రి నితిన్ గడ్కరీ రూ.3,000గా నిర్ణయించినట్టు తెలిపారు. దీనిలో వాహనదారులు 200 ప్రయాణాలు చేయవచ్చు. లేదా ఒక ఏడాది ప్రయాణించవచ్చు. అంటే ఏది ముందు అయితే అది వర్తిస్తుంది అన్నమాట. ఈ లెక్కన చూస్తే 200 టోల్ ప్లాజాలను మొత్తం రూ.3,000తో లెక్కిస్తే కేవలం రూ.15లే పడుతుంది అన్నమాట.
FASTag Annual Pass: గతంలో ఉన్న లెక్కల ప్రకారం అయితే ఏదైనా టోల్ ప్లాజా గుండా ఒకసారి వెళ్లడానికి సగటున రూ.50 చెల్లిస్తే, 200 టోల్ ప్లాజాలను దాటడానికి ప్రతి ఒక్క వాహనానికి రూ.10,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, కొత్తగా తెచ్చిన వార్షిక ఫాస్టాగ్ పాస్‌ను ఉపయోగించి నేరుగా రూ.7,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది ఈరోజు నుంచే అమలులోకి వస్తుంది.
FASTag Annual Pass: కొత్త వార్షిక ఫాస్టాగ్ పాస్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గతంలో ఫాస్టాగ్‌ను తరచూ రీచార్జి చేయించుకోవాల్సి వచ్చేది. వార్షిక పాస్ అయితే ఏడాదికి ఒకసారి, లేదా 200 టోల్ ప్లాజాల వరకూ వాడుకోవచ్చు. ఆ తర్వాతే కొత్త పాస్ తీసుకోవాల్సి ఉంఉంది. ఈ వార్షిక పాస్ ద్వారా టోల్ చెల్లించడానికి పొడవైన క్యూలలో నిలిచి ఉంటే ఇబ్బందులు కూడా ఉండవు. సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
FASTag Annual Pass: ఈ వార్షిక ఫాస్టాగ్ పాస్ 2025 ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది. ఇది తొలుత జాతీయ రహదారులపై మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర రహదారులపై దీని ఉపయోగం చెల్లదు. మున్ముందు రాష్ట్ర రహదారులకూ వర్తించేలా చేయాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.