Farmers Protest: హర్యానా-పంజాబ్‌లోని శంభు సరిహద్దు నుండి రైతులు ఢిల్లీకి శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరారు. అయితే సుమారు రెండున్నర గంటల తర్వాత రైతులు మార్చ్‌ను వాయిదా వేశారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకే రేపటి వరకు వేచి చూస్తామని రైతు నాయకుడు సర్వన్‌సింగ్ పంధేర్ అన్నారు. ప్రభుత్వంతో మాకు గొడవలు అక్కర్లేదు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ మాతో మాట్లాడాలి. కేంద్రం మాట్లాడితే బాగుంటుంది, లేకుంటే 101 మంది రైతులతో కూడిన బృందం ఆదివారం అంటే డిసెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి పాదయాత్ర చేస్తుంది అని ఆయన చెప్పారు.
గత 9 నెలలుగా క్యాంపింగ్‌లో ఉన్న రైతులు తమ ప్రతినిధులుగా 101 మంది రైతుల బృందాన్ని ఢిల్లీకి పంపారు. రైతులు బారికేడ్లు, ముళ్ల తీగలను కూల్చారు. దీంతో హర్యానా పోలీసులు వారిని హెచ్చరించి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘటనలో 8 మంది రైతులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇది కూడా చదవండి: Dil Raju: నిర్మాత దిల్‌రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి
Farmers Protest: హర్యానా పోలీసులతో చర్చలు జరిపామని పంధేర్ తెలిపారు. వారు మమ్మల్ని డిమాండ్ లేఖ అడిగారు. అనంతరం వారికి డిమాండ్ లేఖను అందజేశాం. వారు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో రేపు చర్చలు ఉంటాయని చెప్పారు. అని పందెర్ తెలియారు. హర్యానా పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్స్ వల్ల రైతు నాయకులు చాలా మంది గాయపడ్డారని ఆయన అన్నారు. దీంతో రైతు బృందాన్ని వెనక్కి పీల్చినట్టు వివరించారు.

