Sridhar Babu

Sridhar Babu: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది జరిగినా ఫిర్యాదు చేయొచ్చు

Sridhar Babu: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం సత్య సాయినగర్లో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మంథని బ్రాంచ్ నూతన భవన నిర్మాణానికి ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం భూమి పూజ చేశారు. రూ.35 లక్షలతో నిర్మించనున్న నూతన భవనం త్వరితగతిన పూర్తి కావాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఇదే క్రమంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందీ జరిగినా ఫిర్యాదు చేయొచ్చని, ఎన్నడూ లేని విధంగా ఈసార ధాన్యం కొనుగోలు జరిగిన మూడు రోజుల్లో నగదును రైతుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తారని తెలిపారు. 

ఇది కూడా చదవండి: Ch Mallareddy: మాజీ మంత్రి మ‌ల్లారెడ్డికి ఈడీ నోటీసులు

Sridhar Babu: అలాగే 56 అంశాలను చేర్చి సమగ్ర కుటుంబ సర్వేకు అందరూ సహకరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమం అందించాలన్నదే తమ లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, ముఖ్య కార్య నిర్వహణాధికారి సత్యనారాయణ రావు, మంథని బ్రాంచ్ మేనేజర్ ఉదయశ్రీ, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *