Nizamabad: ఆయన నడుస్తున్నాడు , ఆయన వెనుక అతడి భార్య అడుగులో అడుగు వేస్తూ నడుస్తుంది. అమ్మా నాన్నా నడిచే దారిలోనే ఆ బిడ్డ నడుస్తున్నాడు. అలా నాసిగిపోతున్న ఆ ముగ్గురి నడకకు బ్రేక్ పడింది. భర్తను కాపాడబోయి..భార్య …అమ్మను నాన్నకు కాపాడబోయి ఆ బిడ్డ ..ముగ్గురు చనిపోయారు. ఇంత కన్నా దారుణం ఇంకేముంటుంది. పాపం కదా
నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పొలంలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి భార్యాభర్తలతో పాటుగా వారి కుమారుడు స్పాట్‌లోనే కుప్పుకూలిపోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా పెగడాపల్లి గ్రామ శివారులోని పంట పొలంలో చోటు చేసుకుంది.రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన దంపతులు గంగారం, బాలమణిలతో పాటు వారి పెద్ద కుమారుడు కిషన్ పొలం వద్దకు బయల్దేరారు.
Also Read: Andhra Pradesh: పసుపు పారాణి ఆరలేదు.. ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్య!
అయితే.. ఓ రైతు అడవి పందుల బారి నుంచి తన పంటను రక్షించుకునేందుకు పొలంలో కరెంట్ షాక్ పెట్టాడు. అది గమనించని గంగారాం విద్యుత్ వైరుకు తగిలి షాక్‌కు గురయ్యాడు. భర్తను కాపాడపోయి బాలమణి, ఆమెను కాపాడబోయి కుమారుడు కిషన్ ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు పొలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గంగారాం దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా.. ఓ కుమార్తె వివాహం జరిపించారు.
పెద్ద కుమారుడు తాజాగా జరిగిన కరెంట్ షాక్‌తో చనిపోయాడు. దీంతో మరో ఇద్దరు అనాథలుగా మారారు. ఘటనా స్థలానికి చేరుకున్న బోధన్ రూరల్ సీఐ, ఎస్ఐ మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవటంతో సాటాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.
