TG: సంగారెడ్డి జిల్లాలో ఓ రైతు కరెంటు స్తంభం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ రైతును వారించిన స్థానికులు కరెంటు స్తంభంపై నుంచి కిందికి దిగేందుకు చొరవ తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర వాలుతండా శివారులో గతంలో గిరిజనులకు భూమి ఇచ్చారు. ఆ భూమిలో 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనం కోసం భూములను తిరిగి తీసుకున్నారు. దీంతో తన భూమి అందులో పోతున్నదని, తానెట్ల బతకాలి అంటూ యువ రైతు రాజు గ్రామంలోని ఓ కరెంటు స్తంభం ఎక్కి వైర్లు పట్టుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. దీంతో స్థానికులు చొరవ తీసుకొని రాజును వారించి కిందికి దిగేందుకు చొరవ చూపారు.
