Rohit Sharma: సెప్టెంబర్ 10న దుబాయ్‌లో ఆసియా కప్‌లో భాగంగా యూఏఈతో జరగబోయే కీలక మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు సిద్ధమవుతున్న సమయంలో, టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆసుపత్రికి వెళ్లడం అభిమానులలో ఆందోళన రేకెత్తించింది. సోమవారం అర్ధరాత్రి ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో రోహిత్ కనిపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రోహిత్ శర్మ ఆసుపత్రికి ఎందుకు వెళ్లారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. రోహిత్ లేదా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. దీంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. రోహిత్ ఆసుపత్రిలోకి వెళ్తున్నప్పుడు విలేకరులు ప్రశ్నించినా, అతడు స్పందించకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, అభిమానులు “హిట్‌మ్యాన్‌కు ఏమైంది?” అని అడుగుతూ అతని ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.
Also Read: UAE Cricketer: గిల్‌కు బౌలింగ్ చేసిన నాటి రోజులను గుర్తుచేసుకున్న యూఏఈ ఆటగాడు
ఇటీవల బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన ఫిట్‌నెస్ పరీక్షల్లో రోహిత్ శర్మ ఉత్తీర్ణుడయ్యాడు. ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆసుపత్రికి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది అతని వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందా లేక ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్య ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ, త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ సిరీస్ అక్టోబర్ 19, 23, 25 తేదీలలో జరగనుంది. ఇలాంటి కీలక సమయంలో రోహిత్ ఆసుపత్రికి వెళ్ళడం జట్టులోనూ, అభిమానుల్లోనూ ఉత్కంఠను పెంచింది. అతడు త్వరగా కోలుకుని, రాబోయే మ్యాచ్‌లకు సిద్ధంగా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Rohit Sharma spotted in Kokilaben hospital Mumbai.❤️ pic.twitter.com/bQ6zTuixGc
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 8, 2025