Akhanda 2

Akhanda 2: అఖండ 2 ఓటిటిపై ఫ్యాన్స్ విన్నపం?

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “అఖండ 2” హవా దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. బాలయ్య బర్త్‌డే సందర్భంగా విడుదలైన టీజర్ అభిమానుల అంచనాలను మించి సంచలనం సృష్టించింది. భారీ స్థాయిలో రూపొందిన ఈ టీజర్ దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ పొందింది. దీంతో చిత్ర బృందం ఉత్సాహంగా ఉంది.

Also Read: OG: ‘ఓజి’ ఫస్ట్ సింగిల్‌ పై క్రేజీ అప్డేట్?

Akhanda 2: ఈ టీజర్ తర్వాత ఓటీటీ వేదికల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ రేసులో ముందంజలో ఉందని టాక్. అయితే, అభిమానులు మాత్రం నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదిరితే మరింత రీచ్, క్వాలిటీ ఉంటుందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలు లాభదాయకమైన ఒప్పందం కోసం చూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఏ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. “అఖండ 2” సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *