Bunny

Bunny : బన్నీ మూవీలో ఆ హీరోయిన్.. నెత్తి కొట్టుకుంటున్న ఫ్యాన్స్

Bunny: అల్లు అర్జున్.. పుష్ప మూవీతో దేశవ్యాప్తంగా దుమ్మరేపాడు. టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పాడు. పుష్క తర్వాత త్రివిక్రమ్​తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగినా..ఎందుకో అది సెట్​ కాలేదు. అటు బన్నీ కూడా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో మూవీ అనౌన్స్​ చేశాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్​తో ఈ మూవీని నిర్మించనుంది. ఇటీవల రిలీజ్ చేసిన అనౌన్స్​మెంట్ వీడియో సినిమా ఏ రేంజ్​లో ఉండబోతుందో చూపించింది. హాలీవుడ్ వీఎఫ్​క్స్ టెక్నిషియన్లతో హీరో-డైరెక్టర్ చర్చలు జరపడం అవి చూస్తుంటే ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా అనిపించింది.

ఇందులో హీరోయిన్ల అంశం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. అట్లీ సినిమా అంటే మినిమమ్ ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. గతంలో అతడు తెరకెక్కించిన రాజారాణి, మెర్సల్, తేరి వంటి సినిమాల్లో డబుల్ హీరోయిన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఈ ముగ్గురు బాలీవుడ్ బ్యూటీలా లేదంటే దక్షిణాది హీరోయిన్లు ఉంటారా అనే కన్ఫ్యూజన్ నడుస్తోంది.

Also Read: Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ టీజర్: ఎప్పుడు రిలీజ్!

Bunny: మొన్నటివరకు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్ పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు అనన్య పాండే పేరు తెరమీదకు వచ్చింది. ఇది విని బన్నీ ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే అనన్య ఇప్పటివరకు హిందీలో సినిమాలైతే చేస్తోంది గానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. దానికి తోడు ఈమె యాక్టింగ్​పై చాలా విమర్శలు. దీంతో బన్నీ పక్కన అనన్య పాండే వద్దు బాబోయ్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సమంత, దిశా పటానీ వంటి పేర్లు కూడా వినిపించాయి. కానీ అట్లీ ఎవరినీ ఎంపిక చేస్తారనేది వెయిట్ అండ్ సీ.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *