Telangana: నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారం కుటుంబం మూడు ప్రాణాలు కోల్పోయింది. వ్యవసాయ పనుల కోసం గురువారం ఉదయం గంగారం తన భార్య బాలమణి, కుమారుడు కిషన్‌తో కలిసి బోధన్ మండలం పెగడపల్లి శివారులోని పొలానికి వెళ్లారు.
అయితే, ఆ రాత్రి అడవి పందులను అడ్డుకోవడానికి వేటగాళ్లు పొలంలో విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. వాటిని గమనించని గంగారం కుటుంబం విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బోధన్ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: iPhone 16e: బెస్ట్ ప్రైస్‌లో ఐఫోన్ 16e..ఇంత కంటే మంచి ఫీచర్స్ ఏ ఫోన్‌లో లేవు భయ్యా…
ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు బాదుకుంటూ కన్నీరు పెడుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన విద్యుత్ తీగలు అమర్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

