fake zoo

Fake Zoo: జూలో పులులను చూసి సంబరపడ్డారు.. వీడియో చూసిన తరువాత ఛీ ఏం పనిరా ఇదీ అని విరుచుకుపడుతున్నారు!

Fake Zoo: జనాలను పిచ్చోళ్లను చేయడంలో చైనావాళ్ళను మించి ఎవరూ ఉండరు. ఒక్కోసారి వాళ్ళు చేసిన పనులు తెలిస్తే వామ్మో అనిపిస్తుంది. చైనాలో ఒక జూ ఉంది. అక్కడికి జనాలు విపరీతంగా వెళతారు. ఆ జూ(Zoo) పేరుతొ బోలెడు సొమ్ము జూ నిర్వాహకులకు అందుతుంది. సాధారణంగా జూ, బీచ్, పార్క్ ఇతర పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులను ఆకర్షించడానికి, కొత్త వ్యూహాలు, మంచి ప్రచార జిమ్మిక్కులు చేస్తారు. అయితే ఇక్కడ ఓ జూ కుక్కలను పులులుగా చిత్రించి పర్యాటకులకు టోపీలు పెట్టింది. అవును.. ప్రచారంలో భాగంగా చైనీస్ జూ చౌ చౌ కుక్కలకు పులుల్లా కనిపించేలా రంగులు వేసిందని జూ యాజమాన్యం అంగీకరించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జూ చేసిన ఈ జిమ్మిక్కుపై చాలా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైజౌలోని ఒక జంతుప్రదర్శనశాల సందర్శకులను చారల పులిగా భావించేలా చౌ చౌ డాగ్‌కు నలుపు – కుంకుమ రంగును పూసింది. ఈ కుక్కల వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. జూ అసలు కథ జనాలకు అర్ధం అయింది. దీంతో జనాలు జూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని తరువాత, జూ స్థానిక మీడియాతో తాము పబ్లిసిటీ జిమ్మిక్ కోసం చౌ చౌ కుక్కలను ఇలా పులుల్లా మార్చామని ఒప్పుకుంది. కుక్కల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని , వాటికి ఎటువంటి హాని లేదని మీడియాకు చెప్పుకొచ్చింది.. జూ నిర్వాహక బృందం.

ఇది కూడా చదవండి: Term Insurance: ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఏమి జరిగినా టర్మ్ ఇన్సూరెన్స్ మీ కుటుంబాన్ని కాపాడుతుంది!

Fake Zoo: ఇలా జూలో కుక్కలను పెట్టి వేరే జంతువుల్లా భ్రమ కల్పించడం మొదటిసరి కాదు. గతంలోనూ ఒక జూలో కుక్కలకు పాండాలను పోలి ఉండేలా చేసి పర్యాటకులను మోసం చేసిన ఘటనలు నమోదు అయ్యాయి. ఇలా కుక్కలకు రంగులు వేసి ఇలాంటి జిమ్మిక్కులు చేయడం పట్ల ప్రజలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ జూ పాండాలను పోలి ఉండేలా కుక్కలను పెయింటింగ్ చేసి వార్తల్లో నిలవడం గత సంవత్సరం ఇదే మొదటిసారి కాదు. ఇప్పుడు పబ్లిసిటీ జిమ్మిక్కు కోసం కుక్కలకు పులి రంగు పూశారు. జూ యొక్క ఈ చీప్ జిమ్మిక్ గురించి చాలా ఆగ్రహం ఉంది.

eseLSMN పేరుతో X ఖాతాలో భాగస్వామ్యం చేయబడిన వీడియోలో, జంతుప్రదర్శనశాలలో రెండు పులి లాంటి కుక్కలు కనిపిస్తాయి. చౌ చౌ కుక్కలకు పులిలా కనిపించేలా కుంకుమ, నలుపు రంగులు పూస్తారు.

జనవరి 27న షేర్ చేసిన ఈ వీడియోపై పలు వ్యాఖ్యలు వచ్చాయి. ఒక వినియోగదారు “కుక్కలు పులుల్లా కనిపిస్తున్నాయి” అని కామెంట్ రాశారు. మరో వినియోగదారు, “ఇది చైనాలో మాత్రమే జరుగుతుంది” అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *