Fahadh Fazil

Fahadh Fazil: జైలర్-2లో ఫహాద్ ఫాజిల్ సంచలన ఎంట్రీ!

Fahadh Fazil: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్-2’ చిత్రంలో నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘జైలర్’కు సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నెల్సన్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ వర్గాల్లో సంచలన వార్త చక్కర్లు కొడుతోంది.

మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ‘జైలర్-2’లో కీలక పాత్రలో నటిస్తున్నారని, ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్ అయ్యారని టాక్. గతంలో ‘వేట్టయన్’లో రజినీతో కలిసి నటించిన ఫహాద్, ఇప్పుడు ‘జైలర్-2’లో మరోసారి సూపర్‌స్టార్‌తో స్క్రీన్ షేర్ చేస్తుండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ కాంబో సినిమాకు భారీ హైలైట్ కానుందని అంటున్నారు.

Also Read: Srinidhi Shetty: ‘రామాయణం’లో సీత పాత్రని పోగొట్టుకున్న KGF బ్యూటీ!

Fahadh Fazil: ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా మీనన్ ముఖ్య పాత్రల్లో కనిపించనుండగా, ఎస్.జె.సూర్య విలన్‌గా విశ్వరూపం చూపనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు మరో ఆకర్షణ. భారీ అంచనాల మధ్య రూపొందుతోన్న ‘జైలర్-2’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hrithik Roshan: అలియా స్పై యూనివర్స్ ‘ఆల్ఫా’లో హృతిక్!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *