Ameerpet: హైదరాబాద్ అమీర్‌పేట్‌లో క్రిసెంట్ కేఫ్ అండ్ బేకరీస్‌లో జరిగిన భారీ పేలుడు స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, ఒక్కరు తీవ్రంగా దెబ్బతిన్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో పేలుడు సంభవించింది.
పేలుడుతో భారీ నష్టం
పేలుడు ప్రభావంతో కేఫ్ పక్కనే ఉన్న హరి దోశ హోటల్ గోడ పూర్తిగా కూలిపోయింది. ఇటుక ముక్కలు ఎగిరిపడటంతో వంటగదిలో పనిచేస్తున్న సోను అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదే విధంగా బబ్లూ కుమార్, నగేష్, కిరణ్ షిండే గాయపడ్డారు. మరో కార్మికుడు భీమ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రథమ చికిత్స అనంతరం అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఇది కూడా చదవండి: TS Honey Trap: అరెరె..ఆ కాల్ మీకూ వచ్చిందా?
పోలీసుల విచారణ
సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. క్లూస్ టీం సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించి సాక్ష్యాలను సేకరించింది. సిలిండర్ లీక్ ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పెద్ద ప్రమాదం తప్పింది
పేలుడు జరిగిన సమయంలో కేఫ్‌లో కస్టమర్లు ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. గాయపడినవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు