Harihara Veeramallu

Harihara Veeramallu: హరిహర వీరమల్లు: కొత్త రిలీజ్ డేట్‌పై ఉత్కంఠ!

Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య వస్తుందనుకున్న ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడడంతో ఫ్యాన్స్‌లో నిరాశ నెలకొంది. అయితే, తాజాగా మేకర్స్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా జూన్ 27 లేదా జూలై 4న థియేటర్లలోకి రావొచ్చని సమాచారం.

Also Read: Bahubali: కొత్త ట్విస్ట్‌తో బాహుబలి రీ-రిలీజ్!

Harihara Veeramallu: ఈ రెండు తేదీల్లో ఒకదానిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం భారీగా నిర్మిస్తున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ట్రైలర్, పాటలు ఇప్పటికే అభిమానుల్లో హైప్ క్రియేట్ చేశాయి. మరి, ఈసారి ఖచ్చితంగా వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వస్తాడా? వేచి చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ee Nagaraniki Emaindi 2: “ఈ నగరానికి ఏమైంది 2” వచ్చేస్తుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *