India: భారతీయ విమానయాన సంస్థల్లో జోష్ నిండుకున్నది. దేశీయ విమానాల్లో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంపై ఆనందంలో ఉన్నాయి. దీంతో ఆయా సంస్థలకు భారీ ఆదాయం సమకూరుతున్నది. దీపావళి పర్వదినం సందర్భంగా రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు ప్రయాణం చేయగా, దానిని అధిగమించి ఈ నెల 17న ఒక్కరోజే భారీ సంఖ్యలో ప్రయాణాలు సాగాయి. ఆ ఒక్కరోజే 5,05,412 మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణం సాగించారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రయాణాలు సాగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
దేశంలోని అన్ని విమానయాన సంస్థలు కలిపి 3173 దేశీయ విమానాల్లో ఈ రికార్డు నమోదైంది. దీపావళి కన్నా, తర్వాత వస్తున్న వివాహాల సీజన్‌కు ముందు ప్రయాణాలు పెరుగుతుండటం కొత్త ట్రెండ్‌ను సూచిస్తున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో విమానయాన సంస్థలు జష్ మీదున్నాయి.

