AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసు మరోసారి కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని సిట్ అధికారులు విచారించారు. తాజాగా ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ సిట్ విచారణకు హాజరుకానున్నారు.
ఇంతకుముందు కూడా విజయసాయిరెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. అప్పట్లో కొన్ని ముఖ్యమైన వివరాలు అధికారులకు ఇచ్చినట్లు ఆయనే చెప్పారు. ఇప్పుడు మరోసారి విచారణకు హాజరుకానుండటంతో, ఆయన ఏమి చెబుతారో అన్నది అందరిలో ఆసక్తిని రేపుతోంది.
విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్!
ఈ విచారణకు ముందు విజయసాయిరెడ్డి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
భగవద్గీతలోని శ్లోకాన్ని పేర్కొంటూ ట్వీట్ చేశారు:
“కర్మ చేయడం నీ హక్కు.. ఫలితాలపై నీకు హక్కు లేదు. కర్మఫలాన్ని ఆశించకు, కర్మ చేయకుండా ఉండకూడదు.” అని శ్లోకాన్ని పేర్కొన్నారు.
విజయసాయిరెడ్డి ఈ ట్వీట్‌తో ఏం చెప్పాలనుకున్నారో స్పష్టంగా చెప్పకపోయినా, ప్రస్తుతం ఆయన విచారణకు వెళ్తున్న సందర్భంలో ఈ ట్వీట్‌కు ప్రాధాన్యత పెరిగింది.
సిట్ విచారణపై ఉత్కంఠ సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని విచారణలో కీలకమైన ప్రశ్నలు అడిగే అవకాశముంది.
ఇప్పటికే కేసులో పలువురిని అరెస్ట్ చేశారు. ఈ విచారణ తర్వాత ఈ కేసులో మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.
ట్వీట్..
विपक्ष सहित सभी राजनीतिक दलों को राज-धर्म का पालन करना चाहिए।
కర్మణ్యే వాధికారస్తే
మాఫలేషు కదాచన!
మా కర్మఫలహేతుర్భూ:
మా తేసంగోஉస్త్వకర్మణి!!
కర్మలను ఆచరించుట యండే నీకు అధికారము కలదు
కానీ వాని ఫలితముల మీద లేదు.
నీవు కర్మఫలములకు కారణం కారాదు.
అట్లని కర్మలను చేయుట మానరాదు.
శ్రీ శ్రీ భగవద్గీత.
विपक्ष सहित सभी राजनीतिक दलों को राज-धर्म का पालन करना चाहिए।
కర్మణ్యే వాధికారస్తే
మాఫలేషు కదాచన!
మా కర్మఫలహేతుర్భూ:
మా తేసంగోஉస్త్వకర్మణి!!కర్మలను ఆచరించుట యండే నీకు అధికారము కలదు
కానీ వాని ఫలితముల మీద లేదు.
నీవు కర్మఫలములకు కారణం కారాదు.
అట్లని కర్మలను చేయుట మానరాదు.…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 12, 2025