Ex MLA Shakeel:

Ex MLA Shakeel: బోధ‌న్ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ అరెస్టు! శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే అదుపులోకి..

Ex MLA Shakeel: బీఆర్ఎస్ బోధ‌న్‌ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ ష‌కీల్ అమీర్ మ‌హ‌మ్మ‌ద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైద‌రాబాద్‌కు చేరుకోగానే శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లోనే ఆయ‌న‌ను అరెస్టు చేశారు. ఆయ‌న‌పై ఇప్ప‌టికే వివిధ కేసులు న‌మోదై ఉన్నాయి. ఆయా కేసుల‌పై అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఈ మేర‌కు ఆయ‌న‌ను తొలుత ఏ కేసు విష‌యంలో అరెస్టు చూపుతారో.. పోలీసులు ఇంకా వెల్ల‌డించ‌లేదు.

Ex MLA Shakeel: మాజీ ఎమ్మెల్యే ష‌కీల్‌పై ముఖ్యంగా ప్ర‌జాభ‌వ‌న్ వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం కేసులో సాక్ష్యాల‌ను తారుమారు చేశార‌నే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో త‌న కొడుకును ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోప‌ణ‌లు ప్ర‌ధానంగా ఉన్నాయి. ఈ విష‌యంలో పోలీసులు అరెస్టు చేస్తార‌నే భ‌యంతో గ‌త కొన్ని నెల‌లుగా ఆయ‌న దుబాయ్‌లో ఉంటున్నారు. ఈ క్ర‌మంలో త‌న త‌ల్లి అంత్య‌క్రియ‌ల కోసం వ‌చ్చిన ఆయ‌న్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Ex MLA Shakeel: తొలుత ష‌కీల్‌ను బోధ‌న్‌కు త‌ల్లి అంత్య‌క్రియ‌ల కోసం తీసుకెళ్లి, ఆ త‌ర్వాత స్టేష‌న్‌కు త‌ర‌లించే అవ‌కాశాలు ఉన్నాయి. ఆయ‌న అరెస్టుపై ఇంకా పోలీసులు ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ష‌కీల్ అమీర్ మ‌హ‌మ్మ‌ద్ గ‌తంలో బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు బోధ‌న్ ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. ఆయ‌న‌పై గ‌తంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.

Ex MLA Shakeel: గ‌తేడాది డిసెంబ‌ర్ 23న ప్ర‌జాభ‌వ‌న్ వ‌ద్ద కారు ప్ర‌మాదం జ‌రిగింది. అతివేగంగా రావ‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ కారును న‌డిపింది ష‌కీల్ కుమారుడు సాహిల్ కారు న‌డిపితే, వారి ఇంటిలో ప‌నిమ‌నిషి ఆసిఫీపై కేసు న‌మోదు చేయించారు. దీంతో సాహిల్‌ను ప్ర‌ధాన నిందితుడిగా పోలీసులు గుర్తించి, ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ప్ర‌జాభ‌వ‌న్ కారు ప్ర‌మాదం కేసు విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హారించార‌ని పంజాగుట్ట సీఐ దుర్గారావుపై స‌స్పెన్షన్ వేటు కూడా వేశారు. ఇదే విష‌యంలో ష‌కీల్‌ ప‌రారీలో ఉన్నార‌ని లుకౌట్ నోటీసుల‌ను జారీ చేశారు. ఇప్పుడు అదుపులోకి తీసుకోవ‌డం ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *