Ex CM YS Jagan:ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం (నవంబర్ 20న) సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు సుదీర్ఘకాలం తర్వాత రేపు ఉదయం 11:30 గంటలకు ఆయన హాజరవుతారని తెలిసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వైఎస్ జగన్ అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది. దీంతో ఈ నెల 21న లోగా వ్యక్తిగతంగా తమ ముందు తప్పక హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ మేరకే గడువుకు ఒకరోజు ముందే ఆయన సీబీఐ కోర్టుకు వెళ్లనున్నట్టు సమాచారం.
Ex CM YS Jagan:2013 సెప్టెంబర్ నుంచి బెయిల్‌పై ఉంటున్న వైఎస్ జగన్.. గత ఆరేళ్లుగా కోర్టుకు ఆయన ప్రత్యక్షంగా హాజరేకాలేదు. ప్రస్తుతం డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నది. దీంతో ఆయన వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని సీబీఐ తన వాదనలను వినిపించింది. ఆ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. నవంబర్ 21లోగా వ్యక్తిగతంగా హాజరు కావాలని జగన్‌కు ఆదేశాలను జారీ చేసింది.
Ex CM YS Jagan:ఇదిలా ఉండగా.. ఇటీవల వైఎస్ జగన్ కోర్టు అనుమతితోనే యూరప్ పర్యటనకు వెళ్లొచ్చారు. పర్యటన అనంతరం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా కోర్టు జగన్‌ను అంతకు ముందే ఆదేశించింది. అప్పుడే ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరారు. అయితే సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేయడంతో జగన్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

