Kangana Ranaut: ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న కంగనా రనౌత్ రాజకీయ జీవితం గురించి, మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. నెలసరి సమస్యలు ఒక మహిళగా, తాను ఎదుర్కొంటున్న నెలసరి సమస్యల గురించి కంగనా మాట్లాడారు. నటిగా ఉన్నప్పుడు కార్వాన్‌లు, ప్రత్యేక సౌకర్యాలు ఉండేవని, కానీ రాజకీయాల్లో 12 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు టాయిలెట్‌లు కూడా దొరకడం కష్టమవుతుందని చెప్పారు. ఇది కేవలం తనకే కాదు, ఇతర మహిళా ఎంపీలకు కూడా పెద్ద సమస్య అని అన్నారు నెలసరి సమయంలో మహిళల శరీరం నుండి ప్రతికూల శక్తి విడుదల అవుతుందని, ఆ సమయంలో వంట చేయకపోవడమే మంచిదని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.
నెలసరి సమయంలో ఎదురయ్యే ఈ ఇబ్బందులను కేవలం ఒక చిన్న సమస్యగా చూడకూడదని, ఇది ఒక “పెద్ద విపత్తు” అని, ఈ బాధను వర్ణించడం చాలా కష్టమని ఆమె అన్నారు.చాలామంది మహిళలు ఆమెకు మద్దతు తెలుపుతూ, మహిళా ప్రజాప్రతినిధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో, నెలసరి సెలవులను వ్యతిరేకిస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలకు ఈ తాజా వ్యాఖ్యలు కొంత భిన్నంగా ఉన్నాయి. అప్పట్లో, నెలసరి అనేది ఒక అనారోగ్యం లేదా వైకల్యం కాదని ఆమె పేర్కొన్నారు. కంగనా సినిమా పరిశ్రమను “డర్టీ ప్లేస్” అని అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: Kangana: పెళ్లయిన పురుషులతో సంబంధాలపై కంగనా షాకింగ్ కామెంట్స్
బయటి నుంచి వచ్చిన వారికి ఆ పరిశ్రమలో దయ ఉండదని ఆమె అన్నారు. అలాగే, బాలీవుడ్‌లోని చాలామంది హీరోలకు మర్యాద తెలియదని, వారు తనను చాలా ఇబ్బందులకు గురి చేశారని కూడా ఆరోపించారు. వివాహితులతో సంబంధాలు పెట్టుకోవడం గురించి సమాజం కేవలం మహిళలనే తప్పు పడుతుందని కంగనా పేర్కొన్నారు. అలాగే, డేటింగ్ యాప్‌లను ఆమె వ్యతిరేకించారు. ప్రేమలో పడటం లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం మంచిదని, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు మహిళలకు సురక్షితం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

