WTC Prize Money: 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. జూన్ 16న సౌతాఫ్రికా కొత్త టెస్ట్ ఛాంపియన్‌గా అవతరిస్తుందా..? లేక ఆస్ట్రేలియా వరుసగా రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంటుందా అనేది ఉత్కంఠగా మారింది. కానీ అంతకు ముందే ఈ పోటీకి ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. దీని ప్రకారం గెలిచిన జట్టుకు దాదాపు రూ. 30 కోట్లు దక్కనుంది. రన్నరప్ జట్టుకు రూ.18 కోట్లు లభిస్తాయి. ఫైనలిస్ట్ జట్లే కాకుండా ఇతర జట్లు కూడా ICC ప్రైజ్ మనీని అందుకుంటాయి.
నిజానికి టీమిండియా వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరుకునే అవకాశం వచ్చింది. కానీ వరుసగా రెండు సిరీస్‌లను కోల్పోయిన తర్వాత WTC ఫైనల్ కలలు చెదిరిపోయాయి. న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయిన భారత్.. ఆ తర్వాత బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌ను 3-1 తేడాతో కోల్పోయింది. దాంతో టీమిండియా పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. అయితే టీమిండియాతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ప్రతి జట్టుకు ఐసీసీ ప్రైజ్ మనీ ప్రకటించింది.
భారతదేశానికి 12 కోట్లు
పాయింట్ల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న భారత్‌కు 1.4 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే 12 కోట్ల 85 లక్షల రూపాయలు బహుమతిగా అందుతుంది. అదేవిధంగా పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టుకు 1.2 మిలియన్ అమెరికన్ డాలర్లు.. అంటే రూ. 10 కోట్ల 26 లక్షలు. ఐదవ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌కు రూ.8.21 కోట్లు.. 6వ స్థానంలో ఉన్న శ్రీలంకకు రూ.7.18 కోట్లు, 7వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌కు రూ.6.15 కోట్లు, 8వస్థానంలో ఉన్న వెస్టిండీస్‌కు రూ.5.13 కోట్ల ప్రైజ్మనీ దక్కుతుంది.
Also Read: Test captaincy: టెస్ట్ కెప్టెన్‌గా గిల్, బుమ్రా కాదు.. తెరపైకి కొత్త పేరు!
పాకిస్తాన్ ఎంతంటే?
WTC Prize Money: చివరి స్థానంలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు 480,000 US డాలర్లు అందుకుంటుంది. మూడో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మొత్తం 19 మ్యాచ్‌లు ఆడి 9 గెలిచి, 8 ఓడిపోయింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. పాకిస్తాన్ విషయానికొస్తే మొత్తం 14 మ్యాచ్‌లు ఆడగా, వారు 5 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. తద్వారా మూడవ స్థానంలో ఉన్న భారత్ కు రూ. 12 కోట్ల 85 లక్షల ప్రైజ్ మనీ వస్తే..చివరి స్థానంలో ఉన్న పాకిస్తాన్ కు రూ.4 కోట్ల 11 లక్షలు మాత్రమే దక్కుతాయి.