Etala rajendar: తెలంగాణ ప్రాంతం బీద రాష్ట్రమా? ధనిక రాష్ట్రమా? అన్న విషయాలపై గత రెండు రోజులుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి నిన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో చేసిన ఆర్థికంగా ఇబ్బందులున్నాయన్న వ్యాఖ్యలపై దుమారం రేగుతున్నది. ఇప్పటికే ఆయన మాటలపై ఉద్యోగ సంఘాలు, బీఆర్ఎస్ నేత కేటీఆర్, బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు గుప్పించగా, తాజాగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Etala rajendar: తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదు.. దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రం.. అని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. సన్నబియ్యంతో అన్నంతిన్న దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని తేల్చి చెప్పారు. నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వే వ్యవస్థ ఉన్నదని, ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ ఉండేదని, కాకతీయులు కట్టించిన గొప్ప చెరువులు తెలంగాణకు నీటి గొప్ప వనరులు అని వివరించారు.
Etala rajendar: అలాంటి తెలంగాణను రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక దివాలా తీయించారని, ఆయన దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డికి పాలించే చేతకావడం లేదని, అనుభవం లేక ఏం మాట్లాడాలో తెలియడం లేదని తెలిపారు. నీకు పాలన చేతకాకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

