etala rajendar: కేటీఆర్‌కు ఈటల ఓపెన్ ఛాలెంజ్

etala rajendar: బీజేపీ సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై విమర్శలు చేశారు. బయటకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలున్నట్టు కనిపించినా, వాస్తవానికి బీజేపీ ఎదుగుదల చూసి భయపడుతూ, వెనకవైపు కలిసి పని చేస్తున్నాయన్నారు.

“బీజేపీ మాత్రమే నిజమైన ప్రజాస్వామ్య పార్టీ. మిగతా పార్టీలు అన్నీ కుటుంబ పాలక పార్టీలే. చాయ్ అమ్మే వ్యక్తిని బీజేపీ ప్రధానిగా చేసింది. దళితుడిని (రామ్‌నాథ్ కోవింద్‌), ఆదివాసీ బిడ్డను (ద్రౌపది ముర్ము) రాష్ట్రపతులుగా నిలబెట్టిన పార్టీ బీజేపీయే. అటువంటి నాయకులపై కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు వ్యతిరేకంగా పోటీ పెట్టడం సిగ్గుచేటు,” అని అన్నారు.

హైదరాబాద్‌ను బెంగాల్‌లా చేయాలా?

ప్రస్తుతం బెంగాల్‌లో జరుగుతున్న పరిస్థితులను ప్రజలు చూస్తున్నారని, హైదరాబాదులో కూడా అలాంటి పరిస్థితులు రావాలంటే ఎంఐఎంను గెలిపించండి అని ఎద్దేవా చేశారు. వక్ఫ్ భూముల పేరిట వేల కుటుంబాలు కన్నీళ్లతో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కేటీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్

“పదేళ్ల బీజేపీ పాలన గురించి చర్చకు సిద్ధమా కేటీఆర్? అబిడ్స్ చౌరస్తాలో చర్చకు రా. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ అబద్ధాలు చెబుతున్నావు. నిజానికి వస్తే చర్చించుకుందాం” అంటూ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి, మంత్రులు విదేశాలకు వెళ్లినప్పుడు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నా, హక్కుగా ఒక్క రూపాయి Hyderabadకి రాలేదని అన్నారు.

“బాంబుల మోతలు లేకుండా ఉండాలంటే…”

ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేస్తూ, “బాంబుల మోతలు, ఎగిరిపోయే మాంసం ముద్దలు లేకుండా ఉండాలంటే, బీజేపీకి ఓటు వేయాల్సిందే. దేశ ఐక్యత, సమగ్రత, మహిళల భద్రత కోసం బీజేపీ కట్టుబడి ఉంది. బీజేపీ తీసుకునే ప్రతి నిర్ణయం దేశ ప్రయోజనాల కోసమే,” అని ప్రజలను కోరారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana: న‌ల్ల‌గొండ ఇంటెలిజెన్స్ ఎస్పీ క‌విత‌పై వేటు.. వెలుగులోకి అవినీతి బండారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *