Actress

Actress: రెండో పెళ్లికి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్..ఎవరంటే..?

Actress: గతంలో ఒక్క పెళ్లి చేసుకుంటే వాళ్లతోనే మిగిత జీవిత మొత్తం గడిపేవారు. టెక్నాలజీతో పాటు కాలం మారింది. ఇప్పుడు విడాకులు తీసుకున్నా, జీవిత భాగస్వామి లేకున్నా మళ్లీ కొత్తగా పెళ్లి చేసుకోవడం సాధారణమైంది. ఈ ట్రెండ్ సినీ ప్రపంచంలోనూ ఎక్కువగా కనిపిస్తోంది. సింగర్ సునీత నుంచి నాగచైతన్య వరకూ పలువురు రెండో పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించారు. తాజాగా ఈ జాబితాలో హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా చేరబోతోంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన ఎస్తేర్, ముంబైలో చదువుకున్నారు. బాలనటిగా కొంకణి సినిమాల్లో నటించి, 2012లో హిందీ సినిమా బారొమాస్ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో వేయి అబద్ధాలు సినిమాతో అడుగుపెట్టి, భీమవరం బుల్లోడుగరంజయ జానకి నాయకఐరావతం69 సంస్కార్ కాలనీడెవిల్టెనెంట్ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక్క గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇది కూడా చదవండి: Illegal Affair: లవర్ తో కలిసి రెండేళ్ల కూతురిని చంపిన కసాయి తల్లి

వ్యక్తిగత జీవితంలోనూ ఎస్తేర్ తరచూ వార్తల్లో నిలిచారు. సింగర్ నోయెల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె, కేవలం ఏడాది లోనే విడాకులు తీసుకున్నారు. తర్వాత సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ సైలెంట్‌ అయిపోయారు. అయితే తాజాగా ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

ఇటీవల ఎస్తేర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్రైస్తవ వివాహంలో ధరించే తెల్లటి గౌను వేసుకుని, పడవలో కూర్చున ఫోటోలు షేర్ చేశారు. వాటికి క్యాప్షన్‌గా – “జీవితంలో మరో అందమైన సంవత్సరం.. అవకాశాలు, అద్భుతాలను ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. పుట్టినరోజు సందర్భంగా మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. త్వరలోనే మీతో ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ పంచుకుంటాను. వేచి ఉండండి” అని రాసుకొచ్చారు.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె రెండో పెళ్లి ఫిక్స్ అయిందని కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు కొత్త జీవితానికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఎస్తేర్ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరో మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది.

మరి నిజంగా ఎస్తేర్ నోరోన్హా త్వరలో రెండో పెళ్లితో కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తారా? లేదా కేవలం ఇది ఓ ప్రమోషనల్ సర్ప్రైజ్ మాత్రమేనా? అన్నది సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. కానీ ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్‌లో హాట్ బజ్‌గా మారింది.

ALSO READ  Fennel Water Benefits: జీలకర్ర నీరు తాగితే.. శరీరంలో జరిగే మార్పులివే

Ester Noronha

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *