Errabelli Dayaker Rao:మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో యూరియా కొరతకు నిరసనగా రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఆ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా రైతులకు సంఘీభావంగా పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎరువుల కొరతకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Errabelli Dayaker Rao:రాయపర్తిలో జరిగే రైతు ధర్నాను తెలుసుకొన్న ఇతర రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోసాగారు. ఈ సమయంలోనే ఎర్రబెల్లి దయాకర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీసులు తీసుకెళ్తుండగా, రైతులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారించినా రైతులు వినలేదు. అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ నిరసించారు. ఎట్టకేలకు ఎర్రబెల్లిని రాయపర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.